
లారీల కొరతతో నిలిచిన ధాన్యం… కాద్లూర్ రైతుల ఆందోళన.. పట్టించుకోని అధికారులు
టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి గత కొన్ని రోజులు నుండి లారీలు రాక తూకం వేసిన ధాన్యం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్తున్నప్పటికీని జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామ రైతులు వాపోతున్నారు. కేంద్రంలో తూకం వేసిన ధాన్యంతో పాటు అరబోసిన ధాన్యం కుప్పలు కూడా లారీలు రాక రైతులు ఇబ్బందులకు గురవుతున్న అధికారులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసి వరదకు కొట్టుకుపోతున్నాయాని గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగులు చేస్తామని చెప్తున్నా, ఆరబెట్టిన ధాన్యం తూకం వేయడంలో కొనుగోలు కేంద్రాల యాజమాన్యం లారీల కొరతతో తూకం వెయ్యడానికి వెనకాడుతున్నారని గ్రామ రైతులు తెలిపారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కేంద్రానికి లారీల కొరత లేకుండా చేసి గ్రామ రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
