
బాచుపల్లి గ్రామంలో ఘనంగా “మదర్ సాల్” కార్యక్రమం
బాచుపల్లి గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన “మదర్ సాల్” (మదర్సా) కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు గ్రామంలో సోదరభావం, ఐక్యత, శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కొలన్ కృష్ణ రెడ్డి, మాజీ సర్పంచులు సుధాకర్, సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీతారామ్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్, బిక్కన్ షా, కొలన్ యుద్ధం రెడ్డి,గోపాల్ రెడ్డి, జనార్దన్, ఎస్.డి సాలీమ్, ఎస్.డి సాలీమ్ అక్బర్, ఫారూఖ్,చాంద్, అక్బర్, ఖాజా,శంకర్ రెడ్డి, జీతూ మాధవ్ రెడ్డి, సి.ఏచ్.జీతయ్య, కె. జీతయ్య, ఆగం శంకర్, వెంకటేష్,ఉదం రెడ్డి, జి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.