Spread the love

లబ్ధిదారులకు త్వరగా రుణాలు మంజూరు చేయండి.

కమిషనర్ ఎన్.మౌర్య

కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు ఎంపికైన వారికి త్వరగా రుణాలు మంజూరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బ్యాంకర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూ లు నిర్వహించినా ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. 1:2 నిష్పత్తిలో లబ్ధిదారులకు రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వద్ద రుణాలు మంజూరు కావాల్సి ఉందన్నారు. అన్ని దరఖాస్తులు పరిశీలించి త్వరగా పంపిణీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎల్.డి.ఎం.విశ్వనాథ్ రెడ్డి, సి.ఎం.ఎం. కృష్ణవేణి, సోము, బ్యాంకర్లను పాల్గొన్నారు.