TEJA NEWS

భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్, రాజీవ్ గృహకల్ప, గచ్చిబౌలి డివిజన్ లోని నేతాజీనగర్ మరియు పలు కాలనీలలోని సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ వారి పిలుపు మేరకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదములను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. తెల్లవారు జాము నుండే సాయిబాబా దేవాలయానికి భక్తులు పోటేత్తారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఏది ఆశించకుండా గురువు తన శిష్యుడికి విద్యను నేర్పిస్తారు.

దాంతో శిష్యుడు తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తాడు. ఇదీ గురు శిష్యుల సంబంధం, ఏ రకమైన పేగుబంధం లేని పరమాత్మ సంబంధమని పేర్కొన్నారు. గురువులను ప్రతి విద్యార్థి గౌరవించుకునేందుకు కృషి చేయాలని, అప్పుడే సంస్కారవంతమైన విద్య లభిస్తుందని వివరించారు. విద్యార్థులు గురువు బాటలో నడిస్తే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, నారాయణ, లక్ష్మణ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, బసవయ్య, మనోజ్, శ్రీనివాస్, కుమార్, మహేందర్, షఫీ మహిళలు చంద్రకళ, లక్ష్మి, కుమారి, సుధారాణి, గంగ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.