
సంకల్ప వరసిద్ధుని ఆలయంలో గురు పౌర్ణమి పూజలు
తిరుపతి: గురుపౌర్ణమి సందర్భంగా స్థానిక కరకంబాడీ రోడ్డులోని వినాయక సాగర్ లో ఉన్న సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆలయ పురోహితులు ఆది గురుస్వామి, సురేష్ స్వామిల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేపట్టి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేశారు. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం వలన సర్వశుభాలు జరుగుతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, తొండమనాటి సుబ్రహ్మణ్యం, వేలూరు పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
