
గురుపౌర్ణమి శుభాకాంక్షలు:-
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ మరియు రాజీవ్ గాంధీ నగర్ లో సాయి బాబా మందిరంలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి….
నిజాంపేట్, రాజీవ్ గాంధీ నగర్ ఆలయంలోని ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో ముఖ్య అతిధులుగా కత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నేత శంబిపూర్ కృష్ణ, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పెద్ది రెడ్డి సుజాత పాల్గొని ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధించి, తీర్థ ప్రసాదాలు అందుకొని శ్రీ బాబా ఆశీర్వాదం తీసుకొని దైవ కార్యానికి పాత్రులు అయ్యారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్ సాయి బాబా ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయకులు బొబ్బ శ్రీను, నిజాంపేట్ సాయి బాబా ఆలయ కమిటీ సభ్యులు ఏనుగుల రాజశేఖర్ రెడ్డి , ఏనుగుల చంద్ర శేఖర్ రెడ్డి, రాజీవ్ గాంధీ నగర్ ఆలయ కమిటీ సభ్యులు భారతి అమ్మ, యువకులు ప్రవీణ్, చరణ్, రామ్ చరణ్, భక్తులు మరియు కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు….*
