
హన్మంత్ రెడ్డి నువ్వు ముందు నిద్రమత్తు వీడి ప్రజా జీవితంలోకి రా…. ప్రజా సమస్యలు, మీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు తెలుస్తుంది : బిఆర్ఎస్ పార్టీ నాయకులు…
చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలను హన్మంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బి.ఆర్.ఎస్.ప్రజా ప్రతినిధులు, జిహెచ్ఎంసికి చెందిన పలు డివిజన్ల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు పత్రికా ప్రకటనలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తివి నీవా మా నాయకులు, కుత్బుల్లాపూర్ అభివృద్ధి కారకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారిని అని వారు ప్రశ్నించారు.
ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజల మన్ననలను అందుకున్న మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు అని, అలాగే మూడు సార్లు ప్రజల చేత చీత్కారానికి గురైన నీవా అనేది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర మా నాయకుడిదైతే, హ్యాట్రిక్ లూజర్ గా పేరుతెచ్చుకున్న చరిత్ర నీది.
కాంగ్రెస్ అనాలోచిత, అరాచక పాలనపై సుప్రీమ్ కోర్ట్ మొట్టికాయలు వేయడంపై మా ఎమ్మెల్యే అన్నవి వాస్తవం కదా…? కంచె, గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మీ కాంగ్రెస్ పాలకులు చేసిన దమనకాండ నిజం కదా…? ఏది నిజం కాదు…?
ఎక్కడ పడితే అక్కడ వసూళ్లకు పాల్పడుతూ నీవు, నీ పార్టీ నాయకులను ప్రజలు ఎన్ని చీవాట్లు పెట్టినా, ఎన్నిసార్లు తిట్టినా మీలో కానీ, మీ నాయకత్వంలో మార్పు రాలేదు.
2018 ఎన్నికల్లో నీవు డబ్బులకు అమ్ముడుపోయింది వాస్తవం కాదా….?
అక్రమార్జనే ధ్యేయంగా వసూళ్లకు పాల్పడే నీవా …. అను నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే మా నాయకుడిని అనేది.
నిద్రమత్తు వీడి ప్రజా జీవితంలోకి వచ్చి చూడు… ప్రజా సమస్యలు, మీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు కనపడుతుంది.
ప్రజా సంక్షేమం గురించి కనీసం అవగాహన లేదు నీకు, ఒక విషయ పరిజ్ఞానం లేదు, అవగాహనతో మాట్లాడు, లేదంటే కుత్బుల్లాపూర్ ప్రజలే నీకు సరైన సమాధానం చెబుతారు.
రాజకీయ మనుగడ కోసం, మీ పార్టీ పెద్దలు, రేవంత్ రెడ్డి మెప్పు కోసం వెంపర్లాడేడి నీవు.
తెలంగాణ ప్రజలు, కుత్బుల్లాపూర్ ప్రజలు నిండు మనసుతో గెలిపించారు గనుకే మా ఎమ్మెల్యే గారికి రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించారు.
డిల్లీ పెద్దల మెప్పుకోసం రాజకీయాలు చేసేది నీవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రశ్నించే దమ్ము లేదు. అడ్డగోలు హామీలతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా మహిళలకు ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైంది. కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ పరిస్థితి ఏమిటి..? వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ పరిస్తితి ఏంటి…? మహిళలకు నెలా నెల ఇస్తామన్న 2,500/- రూపాయలు, విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు ఇంకెప్పుడు ఇస్తారు. ఎన్నికలు ముగిసి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరన్న కావస్తున్న ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల పరిస్థితి సంగతేంటి…? కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న అవస్థలు తెలుసుకునే సోయిలేదు. వీటిపై మాట్లాడే ఆలోచన అస్సలే లేదు నీకు.
ఆరు నెలలుగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సెలవులపై వెళ్ళాడు. అధికారి లేక ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు పడుతున్న అవస్థలు కనబడడం లేదా…? కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అని చెప్పుకునే నీవు , ఈ సమస్యపై ఆటు ముఖ్యమంత్రిని గానీ, ఇంచార్జి మంత్రిని గానీ కలిసి సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. నీవా మా నాయకుడిని అనేది.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేసేది మా పార్టీ, మా నాయకులు. మాకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉంది.
కనీస గౌరవం, ఇంగిత జ్ఞానం, ప్రోటోకాల్ తెలియకుండా ప్రారంభోత్సవాల పేరుతో హైరానా చేసే నీవా మా ఎమ్మెల్యే గారిని అనేది.
సరిగ్గా ఎన్నికలకు ఒక నెల ముందు నువ్వు ప్రజల్లో కనిపిస్తావు. ఎన్నికలు అయిపోగానే బంజారా హిల్స్ కి ఎగిరిపోతావ్. కానీ పదవితో సంబంధం లేకుండా ఇక్కడే ఉంటూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులు మా ఎమ్మెల్యే .
కాంగ్రెస్ పాలన, సీఎం పనితీరుపై మీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారే తప్పు పట్టారు.
మీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి వచ్చి అడగండి. ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
మీ పార్టీ మంత్రే మా మంత్రులం కమిషన్లు తీసుకుంటున్నారని సభాముఖంగా అన్నారు. కమిషన్లు లేనిదే ఏ ఫైల్ ముందుకు కదలదు అని చెప్పిన విషయాన్ని మా ఎమ్మెల్యే ప్రస్తావిస్తే అందులో మీ కొచ్చిన సమస్య ఏంది…? తప్పును ప్రశ్నించడం తప్పా…?
మీకు చేతనైతే కమీషన్లకు కక్కుర్తి పడే మీ పార్టీ అధిష్టానం, నాయకులపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడు.
ఇకనైనా హన్మంత్ రెడ్డి మా నాయకులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గురించి మాట్లాడేటపుడు విషయ పరిజ్ఞానం, కనీస అవగాహనతో మాట్లాడు. లేకపోతే బిఆర్ఎస్ శ్రేణులు, కుత్బుల్లాపూర్ ప్రజలు, వివేకన్న అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
ఈ సమావేశంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, ఎర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, నరేందర్ రెడ్డి, నదీమ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.
