
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కి వినతి పత్రం ఇచ్చిన వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట పరధిలోని ఐనవోలు మండలములో రైతుల సౌకర్యార్ధము మార్కెట్ సబ్ యార్డు ఏర్పాటు కొరకు 6 ఏకరముల ప్రభుత్వ భూమి కేటాయించగలరని వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మెన్ నరుకుడు వెంకటయ్య హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ని కలిసి కోరడం జరిగినది.
గతములో ఐనవోలు తహసీల్దార్ 5 ఏకరముల భూమిని గుర్తించడం జరిగినది. కానీ అట్టి భూమి మార్కెట్ సబ్ యార్డుకు కేటాయించబడలేదు. అందుకు గాను ఐనవోల్ గ్రామపంచాయతీ పాలక వర్గం వారు గ్రామ రెవిన్యూ పరిదిలో ఆరు ఏకరముల ప్రభుత్వ భూమినీ గుర్తించి తీర్మానం చేసి అప్పటి కలెక్టర్ కి కూడా దరఖాస్తులు కూడా చేయడం జరిగింది అయితే వర్ధన్నపేట ఎంఎల్ఏ కేఆర్ నాగరాజు కూడా స్థల పరిశిలిన చేసి హన్మకొండ కలెక్టర్ కి ఎంఎల్ఏ నాగరాజు గారు ల్యాండ్ ఉంది సంక్షన్ ఇవ్వండి అని రేక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది.కేటాయిస్తే సబ్ యార్డు నిర్మాణం, అందులో గోదాము మరియు కవర్ షెడ్డు నిర్మాణాలు చేపట్టవచ్చునని మరియు ఇట్టి యార్డు ఏర్పాటు చేస్తే ఐనవోలు మండల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది అని కలెక్టర్ ని ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య కోరడము జరిగినది.
కలెక్టర్ ని కలిసిన వారిలో బ్లాక్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి,వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్.లు పాల్గొన్నారు.
