Spread the love

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాసం ఆరంభ శుభాకాంక్షలు : మాజీమంత్రి ప్రత్తిపాటి.

ఆదివారం నుంచి రంజాన్ నెల ప్రారంభం కానున్నందున, కఠోర ఉపవాస దీక్ష చేపట్టే ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వేసవిలో రంజాన్ దీక్షలు చేసే ప్రతి ఒక్కరూ దైవచింతనతో పాటు, ఆరోగ్యంపై కూడా తగు శ్రద్ధ వహించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. అల్లాహ్ దయతో ప్రార్థనా, దాతృత్వంతో కూడిన స్వీయ దీక్షలు పూర్తిచేసి, సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో తెలిపారు.