Spread the love

రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగాముస్లింసోద‌రసోదరీమణుల‌కు శుభాకాంక్ష‌లు తెలియచేసిన మాజీ మంత్రి విడదల రజిని

మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించిన‌ ఈ రంజాన్ మాసంలో..నెల రోజుల‌పాటు నియ‌మ నిష్ఠల‌తో ముస్లింలు క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని మరియు క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని అన్నారు.

ముస్లింలు అతిపవిత్రంగా భావించే ఈ నెలలో వారు అనేక దైవకార్యాలు చేస్తారని,ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని,ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్‌ను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం అని మాజీ మంత్రి అన్నారు…మ‌నిషిలోని చెడు భావాల్ని,అధ‌ర్మాన్ని,ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని, రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ మాజీ మంత్రి విడదల రజిని శుభాకాంక్షలు తెలిపారు.