
- ముస్లింలపై హేట్ క్యాంపెయిన్ జరుగుతుంది దయచేసి ఆపేయండి: ఉండవల్లి..
- దేశంలో జరిగిన ఉగ్రవాద ఘటన బర్నింగ్ ఇష్యూ అని ఈ విషయంలో కొంతమంది తనకు తెలిసిన మిత్రులు కూడా తెలిసి, తెలియక మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారని ముస్లింలపై దూషిస్తూ మెసేజ్లు పెడుతున్నారని అలా పెట్టవద్దని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రజలను కోరారు..
- ప్రతిసారి ఉగ్రవాదులు దాడులు జరుగుతాయి కానీ ఈసారి జరిగిన దాడి ప్రత్యేకమైనదని ఈ దాడిలో మతం అడిగి చంపడం జరిగిందని, ఉగ్రవాదులు అలా ఎప్పుడూ చేయరని అన్నారు..
- ఉగ్రవాదులు చంపి వెళితే వాళ్లని కాపాడింది ముస్లింలు అన్న విషయం మనం మర్చిపోకూడదని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని హిందూ ముస్లింల ఐక్యత ప్రదర్శించాలన్నారు..
