TEJA NEWS

ఆరోగ్య భరోసానిచ్చేది, ఆర్థిక భద్రతనిచ్చేది సీఎం సహాయనిధి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

127 – రంగా రెడ్డి నగర్ డివిజన్ ప్రాంతానికి చెందిన కలవల మరియమ్మ కేరాఫ్ ఎజ్రా (64), నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కె.వరమ్మ భర్త శ్రీధర్ (45) ఆరోగ్య పరిస్థితిపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని ఆశ్రయించగా వారి ఆర్థిక పరిస్థితి చలించిన ఎమ్మెల్యే మెరుగైన వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కలవల మరియమ్మ కేరాఫ్ ఎజ్రా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కె.వరమ్మ లకు ఒక్కొక్కరికి 2,00,000/- లక్షల రూపాయల చొప్పున ఎల్ఓసీ మంజూరు చేయించగా పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ లబ్ధిదారునికి ఎల్ఓసీ చెక్కును పంపిణీ చేశారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ…..ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక భద్రతనిచ్చేది, ఆరోగ్య భరోసానిచ్చేది ముఖ్యమంత్రి సహాయనిధి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రంగరాయ ప్రసాద్, మాజీ కో- ఆప్షన్ సభ్యులు సలీమ్, నాయకులు సుధాకర్, యూత్ నాయకులు ఎర్వ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.