Spread the love

ఆరోగ్య భద్రతనిచ్చేది… సీఎం సహాయ నిధి: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన జి. రామా రావు, చింతల్ ప్రాంతానికి చెందిన బి.శ్రీనాథ్ లకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జి. రామారావు తండ్రి జి. లక్ష్మయ్య (రూ.2,00,000/-), బి.శ్రీనాథ్ తండ్రి బి.యాదగిరి (రూ.2,00,000/-) లకు ఎల్ఓసీ మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందన్నారు.