
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : హెచ్ఎం డి.పాపయ్య
సూర్యపేట జిల్లా : ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థు లకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందుతుందని సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం దైద పాపయ్య అన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు తినిపించారు. మొదటి ర్యాంక్ సాధించిన కావ్యశ్రీ, రెండవ ర్యాంక్ లహరి, మూడవ ర్యాంక్ ఐశ్వర్యలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు ఆహ్లాదకర వాతావరణం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభి వృద్ధికి తోడ్పడతాయని అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
