Spread the love

హౌసింగ్ ఇంటి స్థలం కోసం దరఖాస్తులు ఆహ్వానం.

కమిషనర్ ఎన్.మౌర్య.

తిరుపతి నగరంలో ఇంత వరకు ఎటువంటి హౌసింగ్ స్కీమ్ లో లబ్దిపొందని అర్హులైన లబ్ధిదారుల నుండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 31 వ తేదీలోపు దగ్గరలో ఉన్న వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంతవరకు ఏటువంటి హౌసింగ్ స్కీమ్స్ లో అంటే, టిట్కో హౌసింగ్, నవరత్నాలు హౌసింగ్, దామినేడు, పాడిపేట, బాలాజీ డైరీ, తనపల్లి, వికృతమాల,తో పాటు ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సొంతంగా ఇల్లు నిర్మించికున్న లబ్ధిదారులు కాకుండా, మిగతా వారు అర్హులని తెలిపారు. తిరుపతి నగరంలో అర్హులైన లబ్ధిదారుల నుండి డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు, లబ్ధిదారులు మీ దగ్గరలో ఉన్న సంబంధిత వార్డు సచివాలయం లో అమెనిటి సెక్రెటరిని కలసి, లబ్ధిదారుల భార్య, భర్త ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్, 3 లక్షల లోపు ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, తదితర పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.