Spread the love

ఇంకెంత మంది సామాన్యులు మోసపోయాక ప్రభుత్వ భూములను కాపాడుతారు.
ప్రజావాణిలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో నేడు సిపిఐ నియోజకవర్గ బృందం కలెక్టర్ గౌతమ్ పొట్రు ని కలిసి గాజులరామారంలో మరియు కుత్బుల్లాపూర్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాల గురించి వివరించి గత ప్రభుత్వ హాయంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయిందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కబ్జాల నుండి ప్రభుత్వ భూములను కాపాడుతానని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర అయినప్పటికీ గాజులరామారంలో జరిగిన కబ్జాల పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల తిరిగి సర్వేనెంబర్ 307, 326 342, 329 లలో భూకబ్జాలు మొదలయ్యాయని వీటి వల్ల సామాన్య ప్రజలు మోసపోతున్నారని దీనికి కారణం రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ కబ్జాలు నేటికీ కొనసాగుతున్నాయని, కబ్జాలను అరికట్టాలంటే ముందుగా కబ్జాదారుల పైన క్రిమినల్ చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూములను కాపాడడానికి చుట్టు ఫెన్సింగ్ వేయాలని కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ కబ్జాలను అరికట్ట లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వాళ్లకు భూమి ఇస్తానని హామీ ఇచ్చిన మేరకు మేం పేద ప్రజలను డబ్బు లేని వారిని సమీకరించి కలెక్టర్ కి వారి వివరాలను ఇస్తామని వాళ్లకైనా ప్రభుత్వ భూమిని కేటాయిస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని,అదేవిధంగా పేద ప్రజలు కూడా సంతోషపడతారని కావున దీనిపైన ఏదో ఒక రకమైనటువంటి చర్యలు కచ్చితంగా తీసుకోవాలని వారు కలెక్టర్ ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ భూములను కాపాడేంతవరకు సిపిఐ పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కచ్చితంగా ఆ ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం అతి త్వరలో చర్యలు తీసుకుంటామని,చుట్టూ ఫెన్సింగ్ వేస్తామని అవి కచ్చితంగా ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని అనవసరంగా ప్రజలు కబ్జాదారుల మాటలు విని లక్షలు ఇచ్చి స్థలాలు తీసుకొని మోసపోవద్దని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, మండల సహాయ కార్యదర్శి నరసింహ రెడ్డి, కోశాధికారి సదానంద్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, సిపిఐ నాయకులు ఇమామ్, జంబులు పాల్గొన్నారు.