
అకాల వర్షంతో అన్నదాతకు భారీగా నష్టం
వానకు తడిచిన సుమారు 10 వేల పుట్ల ధాన్యం
కష్టాల్లో ఉన్న రైతుకు అండగా ఉంటాం
వెంకటాచలం మండలం ఇస్కపాళెం, ఈదగాలి, తాటిపర్తిపాళెం, పూడిపర్తి గ్రామాల్లో తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడానికి భాదాకరం
ఒక్కో గ్రామంలో వేలాది పుట్లు తడిచిపోయాయి
ఇప్పుడు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులకు ఖర్చులు రెట్టింపవుతున్నాయి..
ధాన్యం కూడా రంగుమారి తక్కువ ధరకు అడిగే అవకాశం ఉంది
ఈ క్రమంలో సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
