
రాష్ట్రం లో ప్రజా సమస్యలు గాలికి
అందగత్తెల పర్యటనతో హంగామా
అప్పుల రాష్ట్రంలో మంత్రుల
గాలి మోటార్లలో పర్యటనలు………………….
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్ ఆరోపణ
వనపర్తి
రాష్ట్రంలో ఒకపక్క ఆర్థిక సంక్షోభం మరోపక్క నిలిచిపోయిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రజలు కటిక దారిద్రంతో జీవిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలి రాష్ట్ర మంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారని మరోపక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హంగామా హార్భాటాలు చేస్తుందని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు సమయం గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకానికి ఖర్చు చేయలేదని ఎక్కడ ఒక అభివృద్ధి పని చేపట్టలేదని అలాంటి ప్రభుత్వం ఇటీవల ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొంతు కోసిన కూడా నేను ఏమి చేయలేను అంటూ చేతులెత్తి మాట్లాడడం అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ 2025 మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తెలు ప్రపంచంలోనే 120 దేశాల నుంచి సుందరిమణులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏర్పాట్లు దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఈ తెలంగాణ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. సాంప్రదాయ భారత దేశంలో మహిళలను ఒక దేవతగా కేంద్ర ప్రభుత్వం భారతదేశ మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తూ కట్టుబొట్టు కలిగిన ఈ భారత దేశ మహిళలకు మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తెల పర్యటన అవమానాన్ని కలిగిచ్చే విధంగా ఉందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపం మార్చిన ముఖ్యమంత్రి తెలంగాణ ఆడపడుచుల యొక్క గౌరవాని దెబ్బతీసే విధంగా ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నెల 16న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దాదాపు పురాతనమైన 750 సంవత్సరాలు చరిత కలిగిన పిల్లలమర్రి కేంద్రాన్ని ప్రపంచ సుందరీమణులు దర్శించుకున్న సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం పేద బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. భారతమాత గౌరవాన్ని ప్రతిష్టను అవమానపరిచే విధంగా ఆడవాళ్లను ఆట బొమ్మలుగా చిత్రీకరించేందుకు కొన్ని వేల రూపాయల కోట్లు ఖర్చుపెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఈ ప్రభుత్వం అనవసరమైన కార్యక్రమాల పేరుతోన రాష్ట్రాన్ని దివాలా తీయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఖజానాల్లో నిధులు లేనప్పుడు రాష్ట్ర మంత్రులు ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగిన గాలి మోటార్లలో ఎందుకు పర్యటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హెలికాప్టర్ లేనిది రాష్ట్ర మంత్రులు బయటికి పర్యటించలేకపోతున్నారని ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని విస్మరించి సంక్షోభంలో నెట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ప్రజలకు ముఖ్యంగా రైతులకు రైతు భరోసా రైతు రుణమాఫీ అందలేదని తొందరలోనే వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారని అలాంటి రైతులకు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న సందర్భంగా రైతులు ఎంతో ఆశపడి వ్యవసాయానికి సిద్ధపడుతున్నారని అలాంటి రైతుల కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇటీవల అకాల వర్షాలు ఈదురుగాలులతో నష్టపోయిన ప్రజలను రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎక్కడ చూసినా వేసవికాలంలో తాగునీటి సమస్యతో విద్యుత్తు సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రభుత్వం టైంపాస్ పాలన కొనసాగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో అవసరం అనుకుంటే ప్రభుత్వం ప్రజల సమస్యలు కూడా ఎందుకు అవసరం లేదని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అప్పుల రాష్ట్రం పేరు చెప్పి ఈ ప్రభుత్వం దొడ్డి దారిన దోపిడీ చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యంగా తొందరలోనే వ్యవసాయ రంగం మరోపక్క విద్యారంగం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పాఠశాలల అభివృద్ధి విద్యార్థులకు వసతులు పుస్తకాలు. దుస్తులు. రైతులకు ఎరువులు. పంట రుణాలు. అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని గత ప్రభుత్వానికి పట్టిన కత్తి పట్టక తప్పదని ఆయన హెచ్చరించారు.
