TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ కూకట్పల్లి సర్కిల్ – 24, కూకట్పల్లి జోనల్ ఆఫీసు లో జరిగిన వీధి వ్యాపారులకు చిన్న రుణాలు అందించే PM SVANIDHI పథకం అమలులో భాగంగా, డిప్యూటీ కమిషనర్, AMOH, PO, CO, ట్రాఫిక్ CI మరియు స్ట్రీట్ వెండర్ కమిటీ సభ్యులతో కలసి సమావేశంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, PM SVANidhi అనేది వీధి వ్యాపారులకు చిన్న రుణాలు అందించే ఒక పథకం అని, ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి మరియు విస్తరించడానికి రూ. 10,000 వరకు రుణాలు పొందవచ్చు అని, ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి భద్రత లేకుండా రుణాలు లభిస్తాయి మరియు ఈ రుణాలకు 7% వడ్డీ రేటు వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అలానే PM SVANidhi పథకం యొక్క లక్ష్యాలు వివరిస్తూ., వీధి వ్యాపారులకు చిన్న రుణాలు అందించడం ద్వారా వారి వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి మరియు విస్తరించడానికి సహాయం చేయటం,వీధి వ్యాపారులను ఆర్థికంగా బల పరచటం జరుగుతుంది అని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ 24 డిప్యూటీ కమిషనర్ గంగాధర్ , AMOH శ్రీనివాస్, PO రాజశేఖర్, CO ముస్తఫా, చెయిన్ మెన్ మచేంద్ర, కూకట్పల్లి ట్రాఫిక్ CI ముత్తు యాదవ్ గారు మరియు స్ట్రీట్ వెండర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.