TEJA NEWS

హైడ్రా కమిషనర్ వచ్చిన లెక్కేలేదు అంటున్న కబ్జాదారులు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి 2రోజులు గడవక ముందే గాజులరామారం డివిజన్ లోని సర్వే నెంబర్ 325లో పట్టపగలే నిర్మాణాలు చేయిస్తున్న కబ్జాదారులు.ఇంత భయం లేకుండా నిర్మాణాలు చెయ్యడానికి కారణం అధికారులు కబ్జాదారులను అరెస్టు చేసి జైలు కు పంపకుండా వాళ్ళు,లేక వాళ్లకు మద్దతు ఇచ్చే నాయకులు,అధికారుల కు లొంగడమే కారణమని ఇప్పటికైన అధికారులు తుతుమంత్రాంగ చర్యలు తీసుకోకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వచ్చే వారం ఈ అధికారుల పైన కలెక్టర్,హైడ్రా కమిషనర్ కి సిపిఐ గా పిర్యాదు చేస్తామని సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు.