
చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలి.
- చెరువుల అభవృద్ధికి ఆటంకాలు లేకుండా చేస్తాం సీఎస్ఆర్ నిధులతో సంస్థలు ముందుకు రావాలన్న హైడ్రా
హైదరాబాద్,
ఔటర్ రింగు రోడ్డు పరిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తాం.. సిఎస్ ఆర్ నిధులతో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు.
చెరువుల సుందరీకరణకే పరిమితం కారాదని.. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సంస్థలకు సూచించారు.
చెరువుల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వెచ్చిస్తున్న, వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న దాదాపు 72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం సమావేశమయ్యారు.
జీహెచ్ ఎంసీ లేక్స్ విభాగం అదనపు కమిషనర్ కిల్లు శివకుమార్‌నాయుడు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సీఎస్ ఆర్ వింగ్ డైరెక్టర్ అర్చనా సురేష్‌తో పాటు.. హెచ్‌ఎండీఏ, జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఈ సమావే శానికి హాజరయ్యారు.
మాధాపూర్‌లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్‌లోని నల్లచెరువు, అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్నుద్దీన్ దౌలా చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
ఔటర్ రింగురోడ్డు పరిధిలో 1025 చెరువులుండగా.. ఇందులో 61 శాతం జాడ లేకుండా ఉన్నాయని.. ఉన్న 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కమిషనర్ చెప్పారు.
