
గురు అనుగ్రహం ఉంటే అన్ని రకాల అనుగ్రహములతో ముందుకు వెళ్లవచ్చని చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురు పౌర్ణమి ని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో ని పురుషోత్తమ పట్నం లో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీసాయి నాధుని మందిరం లో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్య అదితి గా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని సాయిబాబా ను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.చిలకలూరిపేట నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సాయిబాబా ను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు.
ఈ ప్రత్యేక పూజలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,దేవస్థానం కమిటీ వారు పాల్గొన్నారు.
అనంతరం వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
