
మన భారత గడ్డ మీద పర్యాటకులను చంపిన తీవ్రవాదుల ఏరివేతే లక్యంగా దేశ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్-టార్గెట్ విజయవంతం అయినందుకు మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖకి కీలక ఆదేశాలు
భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో పూజలు చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశాలు
ఇంతటి సంక్లిష్టమైన సమయంలో భారత ఆర్మీకి మనమంతా అండగా నిలవాల్సిన సందర్భం
పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” రెండో దాడి విజయవంతం అవడం హర్షించదగ్గ విషయం.
కోట్లి వద్ద గుల్పూర్ ప్రాంతంలో ఉన్న లష్కరే తోయిబా నియంత్రణ కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేసిన ఇండియన్ ఆర్మీ.
ఉగ్ర స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని సూటిగా ప్రయోగించిన అత్యాధునిక ఆయుధాలు.
దాడి దృశ్యాలను అధికారికంగా విడుదల చేసిన భారత భద్రతా సంస్థలు.
ఉగ్రవాదంపై నిర్దాక్షిణ్యంగా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించిన భారత ఆర్మీ బలగాలు.
మన ఆర్మీ బలగాలు సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాడుతున్న సమయంలో వారి క్షేమం కోరి మనమంతా పూజలు చేయడం సందర్భాచితం.
తీవ్రవాదాన్ని యావత్ భారతమంతా ఉక్కు పిడికిలితో ఎదుర్కొన్నది.
ఈ సమైక్యత దేశ భద్రత విషయంలో రానున్న రోజుల్లో కూడా ఉంటుంది.
తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా… ఎక్కడ ఉన్నా కఠినంగా వ్యవహరించాలి.
మన దేశ పౌరుల మీద ఇటీవల కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా ఇండియన్ మిలటరీ చేపట్టిన సిందూర్ ఆపరేషన్ ను అందరం స్వాగతిస్తున్నo.
తెలంగాణ మంత్రిగా కాదు, ఇంతటి గొప్ప దేశ పౌరురాలిగా, ఈ చర్యపై చాలా సంతోషంగా భావిస్తున్నా.
పుల్వామాలో మనం కోల్పోయిన వీర సైనికులను తిరిగి తీసుకురాలేం, వారి త్యాగం శాశ్వతం. మనమున్నంత కాలం వారిని స్మరించుకుంటాం.
‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ తలెత్తి నిలిచింది. ఏకత్వంతో, శక్తితో, నిశ్శబ్దమైన సంకల్పంతో మనలని ప్రపంచం నిలబెట్టింది.
ఇది కేవలం ప్రతిస్పందన కాదు, ఒక ప్రతి సమాధానం.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా మర్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం.
దేశ భద్రత విషయంలో అందరినీ కలుపుకోవాలి. ఎందుకంటే, ఇది దేశానికి సంబంధించిన విషయం.
ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. చేయదు కూడా.
మేము భారత ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఉంటాం. అందుకే ఈరోజు మా రాష్ట్రంలోని ప్రతి గుడిలో..దేవాలయాల్లో ఆర్మీకి మంచి జరగాలని పూజలు చేస్తున్నాం.
