
పరికి చెరువును కాపాడటానికి వెంటనే చర్యలు చేపట్టండి.
హైడ్రా కమిషనర్ కి వినతి.
జగతగిరిగుట్ట, గాజులరామారం పరిధిలో విస్తరించి ఉన్నటువంటి పరికి చెరువును హైడ్రా కమిషనర్ గా మీరు వచ్చిన తర్వాత, అనంతరం జరిగిన సమావేశంలో కూడా చెరువులో కబ్జాలు చేయొద్దని మీరు సూచించినప్పటికీ తిరిగి యధావిధిగా చెరువులో మట్టిపోస్తూ కబ్జా చేస్తున్నారని, ఇలానే ఇంకో నెల రోజులు సాగితే ఉన్న చెరువు మొత్తం అన్యాక్రాంతం అవుతుందని కాబట్టి వెంటనే ముందుగా చెరువు స్థలంలో ఇల్లు కట్టకుండా, మట్టి పోయకుండా చర్యలు తీసుకోవాలని హైడ్రా ప్రజావాణిలో నేడు మరోసారి చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ అధికారులను కచ్చితంగా అక్కడ నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలను వెంటనే నోటీసులు పంపించి తొలగించాలని అదేవిధంగా చెరువు పరిరక్షణ కొరకు చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. రెండు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చెరువు పరిరక్షణ సమితి నాయకులు ఉమా మహేష్, సాయికుమార్ పంతుల, పవన్ రెడ్డి, జంబు, భరత్ పాల్గొన్నారు.
