
ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనీ ఈనెల 20న చలో హైద్రాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్రపుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని ఫిబ్రవరి 20న చలో హైదరాబాదులో వేలాది మందితో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం CPI (M-L) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల ఎజెండానే ప్రజా పాలన అని తెలంగాణ లో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ లో ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మారాయని వారు అన్నారు,
ఎన్నికల ఎత్తుగాడలలో భాగంగానే నేడు ఇందిరమ్మ ఇల్లు అని స్వయం ఉపాధి అని గ్రామ సభలలో తీర్మాణాలు ప్రవేశపెట్టడమే కాకుండా కమిటీలా ద్వారా నోర్లు మూసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అర్హులైన పేదలను గుర్తించి ఇల్లులేని నిజమైన వ్యక్తులను గుర్తించి వారికీ కేటాయించాలి తప్ప అనర్హులకు కాదు అని ముఖ్యంగా అధికార పార్టీ వారికీ ఎక్కువ అవకాశాలు కల్పించకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనీ వారు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను కొంత మేరకే కాకుండా ఏడవ గ్యారంటీని కూడా తక్షణమే అమలు చేయాలనీ వారు అన్నారు, అభివృద్ధికి నోచుకోని అనేక గ్రామాలను అభివృద్ధి చెందాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎన్నికల ఎత్తుగాడగా గ్రామసభల ద్వారా తీర్మాలనాలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరని తగిన గుణపాఠం రానున్న ఎన్నికలలో జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, AIKMS జిల్లా అధ్యక్షకార్యదర్శిలు పోటు లక్ష్మియ్య, బొడ్డు శంకర్, IFTU జిల్లా ఉపాధ్యక్షులుకునుకుంట్ల సైదులు, సహాయ కార్యదర్శి నర్సింహారావు, అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, బి ఓ సి జిల్లా కార్యదర్శి దేసోజు మధు, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి తదితరులు పాల్గొన్నారు.
