
పశ్చిమ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తా
రంజాన్ తోఫా పంపిణీలో
ఎమ్మెల్యే సుజనా చౌదరి
మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి) అన్నారు.
పవిత్ర రంజాన్ పండుగ ను పురస్కరించుకొని
భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా లో కూటమి నేతలతో కలసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక
ముస్లిం, మైనార్టీ సోదర ,సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా కూటమి నేతలతో
కలిసి రంజాన్ తోఫా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే
సుజనా చౌదరి మాట్లాడుతూ
సార్వత్రిక ఎన్నికల్లో కుల మతాలకతీతంగా అఖండ మెజారిటీ తో గెలిపించిన ముస్లిం, సోదరులకు మైనార్టీలకు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానన్నారు.
పవిత్ర ఖురాన్ అవతరించిన
రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేయడం హర్షణీయమన్నారు. పశ్చిమ లో విద్య, వైద్యం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. పేద ముస్లిం, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది రంజాన్ కి జీవన ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాలను గతం కన్నా మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రణాళికా బద్దంగా పశ్చిమను అభివ్రుద్ది పరుస్తామని తెలిపారు.
టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ సుఖ సంతోషాల మధ్య ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అనేక వేల మందికి రంజాన్ తోఫాను అందిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలను సమానంగా
చూస్తూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడానికి సుజనా చౌదరి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. పేద ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా అందించినందుకు ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , బొమ్మసాని సుబ్బారావు, అబ్దుల్ ఖాదర్, బుల్లా విజయ్ కుమార్, ముస్తాక్ అహ్మద్, దుర్భేశుల హుస్సేన్ , ఏలూరి సాయి శరత్, తిరుపతి సురేష్, పైలా సురేష్,మంటి కోటేశ్వరరావు, మహేష్, ముదిగొండ శివ, మల్లెపు విజయలక్ష్మి, తదితర కూటమి నేతలు పాల్గొన్నారు,
