
చిలకలూరిపేట :
జాతీయ రహదారి కి అనుబంధంగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో, కూలి పనులు చేసుకొని, బ్రతికే ఓ భవన నిర్మాణ కార్మికుడు మద్యం సేవించుచుచిరుతుండైనా, కారపూసల ప్యాకెట్ను కొనుగోలు చేసే తినే ప్రయత్నం చేయగా, నకిలీ నూనెతో తయారు చేసిన, ప్యాకెట్ కావటంతో, ఆ వ్యక్తి, వాంతులు చేసుకొని పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
బార్ అండ్ రెస్టారెంట్లు,హోటల్లు,తనిఖీ చేయాల్సిన ఫుడ్సేఫ్టీ అధికారులుకనుచూపుమేరకైనా కాన రావటం లేదని, మెరుపుతీగల వచ్చి, వారి నెల మామూలుతీసుకొని వెళ్తున్నారని ప్రజలు బహిరంగంగానేచర్చించుకుంటున్నారు.అమ్మకాలు జరుపుతున్న,ఇలాంటి ప్యాకెట్లు షాపులకి వేస్తున్న, ఫుడ్ సేఫ్టీ అధికారులుపైచర్యలు తీసుకోవాలని,లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ,మావుళ్ళ మత్తులోజోగుతు ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి అధికారులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిప్రజలు కోరుతున్నారు.
