Spread the love

భవిష్యత్తులో వ్యవసాయ రంగమే అన్ని రంగాలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది…………. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి
భవిష్యత్తులో వ్యవసాయ రంగమే అన్ని రంగాలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను (పెద్దగూడెం) గురువారం సందర్శించ విద్యార్థులతో ముచ్చటించి వసతులు సమస్యలు ను అడిగి తెలుసుకున్నారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విశేషమైన మార్పులు తీసుకురావడం వల్ల తెలంగాణ సుభిక్షంగా మారిందని అందులో భాగంగానే జిల్లా సమీపంలో పెద్దగూడెం వద్ద మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల ను 20 ఎకరాలను కేటాంచి ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని వసతులతో అద్భుతమైన కళాశాలను నిర్మించాలని కృషి చేసినప్పటికీ దూరదర్శవశాత్తు ప్రభుత్వం కోల్పోవడం వల్ల అది ఆగిపోయిందని రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ కళాశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు కళాశాలను సందర్శించిన సందర్భంగా కళాశాల విద్యార్థులను పేరుపేరునా పరిచయం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ మాజీమంత్రి హయాంలోని ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించినందుకు విద్యార్థులు మాజీ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ విజయ్ కుమార్ ఉంగ్లం తిరుమల్ నాగన్న యాదవ్ బండారు కృష్ణ హేమంత్ ముదిరాజ్ చిట్యాల రాము భాగ్యరాజ్ శివ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.