Spread the love

సినిమా స్టైల్లో … లంచం తీసుకుంటుండగా DEMOను పట్టుకున్న ఏసీబీ

ఆదిలాబాద్ జిల్లాలో సినిమా స్టైల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మారువేషంలో వచ్చి అవినీతికి పాల్పడుతున్న అధికారులకు దడ పుట్టించారు. ఈ ఊహించని ఘటనతో అవినీతి అధికారి ఒక్కసారిగా షాకయ్యాడు

అసలేం జరిగిందంటే.? అబార్షన్ కు మందులు సరఫరా చేసిన కేసులో ఓ మెడికల్ షాప్ యజమాని నుంచి 30 వేలు లంచం డిమాండ్ చేశాడు డిస్టిక్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ రవిశంకర్. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ తో మారువేషంలో లుంగీ ధరించి వచ్చిన ఏసీబీ అధికారులు మార్చి 28న ఆదిలాబాద్ డీఎం అండ్ హెచీ కార్యాలయంలో దాడులు చేశారు. లుంగీలో వచ్చిన ఏసీబీ డీఎస్పీ చాకచక్యంగా వ్యవహరించి మెడికల్ షాప్ యాజమాని నుంచి రూ.30 వేలు లంచం తీసుకుండగా డీఎం రవిశంకర్ ను రెడ్ హ్యండేడ్ పట్టుకున్నారు ఏసీబీ అదికారులు. రవిశంకర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు అధికారు..