
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 132 జీడిమెట్ల డివిజన్ బిజెపి పార్టీ నాయకురాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 132 జీడిమెట్ల డివిజన్ బిజెపి పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి అలివేలు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ప్రజాపాలన, సంక్షేమా అభివృద్ధి, సుపరిపాలన మన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు..
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పార్టీ బలోపేతం అయిందాన్నారు..
రాహుల్ గాంధీ పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు…
ఈ కార్యక్రమంలో అలివేలు, సంగీత, శోభా, సుమిత, పార్వతీ, వరలక్ష్మీ, శిరీష, స్వప్న, కళ్యాణి, విజయ, 132 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
