
సదా మీ సేవలో…. బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఈ ప్రాంత బిడ్డగా అందరికీ అందుబాటులో ఉంటూ మీ సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు.
