TEJA NEWS

ఎడ్లపాడులో వేసవి శిక్షణ తరగతులకు ఆరంభం

  • సృజనాత్మకతను జాగృతం చేసేందుకు బాసట ప్రత్యేక కార్యక్రమం

:వేసవి సెలవులను విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా మార్చేందుకు బాసట (సామాజిక సాంస్కృతిక వేదిక) శ్రీకారం చుట్టింది. బాసట ఆధ్వర్యంలో స్థానిక నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం వేసవి శిక్షణ తరగతులు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గంగయ్య చౌదరి, రిటైర్డ్ లెక్చరర్ జొన్నలగడ్డ శేషయ్య ముఖ్య అతిథులుగా హాజరై, పిల్లలకు మార్గనిర్దేశనం చేశారు. విద్యా కమిటీ కన్వీనర్ కల్లూరు శ్రీనివాసరావు (వాసు) అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, “పిల్లలు తమ ఇష్టమైన రంగాల్లో శిక్షణ పొంది, నూతన ఆలోచనలు, ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు వారిలో మానసిక స్థైర్యం పెంచి, భవిష్యత్తు సామాజిక నాయకులుగా తీర్చిదిద్దుతాయి” అని ఉద్ఘాటించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే బాసట లక్ష్యమని ప్రశంసించారు.

ఈ శిక్షణ తరగతులకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి 200 మంది విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. శిక్షణ ప్రారంభ సందర్భంగా ప్రతి విద్యార్థికి నోట్‌బుక్, పెన్ను బహుమతిగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో బాసట అధ్యక్షులు నూతలపాటి కాళిదాసు, కార్యదర్శి సామినేని శ్రీనివాసరావు, సభ్యులు కేత రామబ్రహ్మం, ముత్తవరపు రవీంద్రబాబు, పోపురి శ్రీనివాసరావు, రావి సురేష్ బాబు, బందెల పీటర్, లింగరావు పాలెం జడ్పీ హైస్కూల్ పర్యవేక్షకులు నంబూరి శివరామకృష్ణ, పారిశ్రామికవేత్త నంబూరి శ్రీనివాసరావు, నారాయణ స్కూల్ డైరెక్టర్ పోపురి వెంకటేశ్వర్లు, స్కూల్ ప్రిన్సిపల్ చెరుకూరి సృజన, వేసవి శిక్షణ ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.