TEJA NEWS

ఆదాయం మీసేవ, జీరాక్స్ సెంటర్లకు
వ్యయం టు వీలర్ వాహన దారులకు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు అనేక రకాల అవసరాల నిమిత్తం నిత్యం మీసేవ, జిరాక్స్ సెంటర్ల చుట్టు ప్రదక్షిణాలు చేయక తప్పడం లేదు. కుల,ఆదాయ, ధ్రువపత్రాలు తో పాటు అనేక రకాల సర్టిఫికెట్స్ కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మీసేవ , జిరాక్స్ సెంటర్ల చుట్టు తిరుగుతూ వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ సంబంధిత మీసేవ, జిరాక్స్ సెంటర్లలో పార్కింగ్ సదుపాయం లేక వాహనదారులు షాపులముందు వాహనాలు నిలిపి వారి అవసరాలనిమిత్తం షాపులు వెళ్ళి పనులు చేపిస్తుంటారు. అంతలో రంగప్రవేశం చేసిన పోలీసులు వాహనాలను ఫోటోలు తీసి నో పార్కింగ్ అంటూ ఫైన్స్ వేస్తున్నారు. ఆన్లైన్ల పేరుమీద, జిరాక్స్, పేరుమీద లాభపడేది షాపుల యజమానులు. వీళ్లకు లాభాలు తెచ్చిపెట్టే కస్టమర్లు మాత్రం పోలీసులకు ఫైన్లు కట్టుకుంటూ పోతున్నారు. ఆదాయం వారికి వ్యయాలు మాకేంటి అంటూ ఆన్లైన్ అవసరాలకు వచ్చిన వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్కింగ్ సదుపాయం లేకుండా బిల్డింగు కట్టుకొని, షాపులు పెట్టుకునేవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పది నిమిషాలు జిరాక్స్ తీసుకెళ్లేవారికేమో వేళల్లో ఫైన్లు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు మున్సిపాలిటీ, పోలీసు అధికారులు పరిష్కారం చూపించాలంటూ పేట వాసులు కోరుతున్నారు.