TEJA NEWS

క్రీడలతో మానసిక దృఢత్వం పెరుగుతుంది : బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

130- సుభాష్ నగర్ డివిజన్ ఎస్.ఆర్. నాయక్ నందు
సుమారు 2.90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్ట్స్ క్రీడా ప్రాంగణాన్ని బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. పిల్లలు మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల్లో ప్రోత్సహించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో షటిల్ కోర్ట్స్ క్రీడా ప్రాంగణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, శేషా చారి, దుర్గా రావు, భాస్కర్ రెడ్డి, హరిబాబు యాదవ్, నర్సింగ్ రావు, శ్యామ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు, పద్మ, అనిల్, శ్రీదేవి, సరిత, ఉమా, స్వర్ణ, ఎస్.ఆర్.నాయక్ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సదానంద చారి, ప్రభాకర్, జనప్రియ భాస్కర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.