
బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్!
బొగ్గు ఉత్పత్తిలో భారత్ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
“1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన విజయం, ఇది ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి, స్వావలంబన పట్ల మన నిబద్ధతను హైలైట్ చేస్తుంది.
ఈ ఘనత సాధించేందకు తోడ్పడిన ప్రతి ఒక్కరి అంకితభావం, కృషిని కూడా ప్రతిబింబిస్తుంది.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది నిజంగా ఒక చారిత్మాక మైలురాయిగా చెప్పవచ్చు.
ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గు చాలా ముఖ్యం. అయితే ఈ అవసరాల కోసం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడి, అక్కడి నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటోంది.
పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దేశంలోనే ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం అనేది అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు.
