TEJA NEWS

పట్టణంలోని భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హై స్కూల్ లో ఘనంగా జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ .

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో గల భారత రత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హైస్కూల్ నందు 10.07 .25 న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గేరా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ రఫాని హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని, ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తుందని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వ ప్రయత్నం అయినా ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయం సాధిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తు కోసం ఇలాంటి తల్లిదండ్రుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరై తమ బిడ్డల ప్రగతి గురించి తెలుసుకోవాలని, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమ్మిళిత కృషితో అద్భుత ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. మరో అతిధి డాక్టర్ కందిమళ్ళ జయమ్మ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సమయాన్ని కేటాయించి పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరైతే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ మెంబర్ అలంగార్ మోహన్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థులు మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని, సెల్ఫోన్లో సమయం గడపడం తగ్గించాలని, చిన్నప్పటినుంచి సేవాభావాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి భారతి, సెక్రటరీ వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తల్లికి వందనం కార్యక్రమం తో పాటు హాజరైన తల్లిదండ్రుల చేత ప్రతిజ్ఞ చేయించారు.