
ఇందిరమ్మ తరహాలో రేవంత్ పాలన..
కాంగ్రెస్ హయాంలో వేగంగా ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి..
నీలం మధు ముదిరాజ్..
మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటనకు హాజరు..
హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికి బస్వేశ్వర విగ్రహం,కేంద్రీయ విద్యాలయం,బహిరంగ సభలకు హాజరైన నీలం..
మెదక్ పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రగతిని మరింత ముందుకు తీసుకొని వెళుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ఆ య కార్యక్రమాలలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి,లక్షికాంత్ రావు, మదన్ మోహన్ రావు,మాణిక్ రావు,టీజిఐఐసి చైర్మన్ నిర్మలా రెడ్డి,సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, స్థానిక ఇంచార్జ్ మాజీ మంత్రి చంద్రశేఖర్ గార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
జహీరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన బసవేశ్వర విగ్రహంతో పాటు కేంద్రీయ విద్యాలయ ప్రారంభోత్సవం, మహిళా స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభం తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన, అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పాలన గుర్తు చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆనాడు ఇందిరమ్మ దయతో ఉమ్మడి మెదక్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు.
