Spread the love

ఇందిరానగర్(ఏ) పోచమ్మ దేవి 9వ వార్షికోత్సవం మరియు నల్లగుట్ట శివాలయం 24వ శివ మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఇందిరానగర్(ఏ) పోచమ్మ తల్లి 9వ వార్షికోత్సవం, నల్లగుట్ట శివాలయంలో 24వ శివ మహా పడిపూజ కార్యక్రమంలో *మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

అనంతరం పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నల్లగుట్ట శివాలయంలో శివాధారణ చేశారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

— పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు..

— సుమారు 50 మంది శివ స్వాములు నల్లగుట్ట శివాలయం నుండి శ్రీశైలం వరకు కాలినడకన పాదయాత్రగా వెళ్ళడం చాలా సంతోషంగా ఉందన్నారు..

— శివ స్వాములు 41 రోజులు ఉపవాస దీక్షలు పూర్తిచేసుకుని కాలినడకన శ్రీశైలం బయలుదేరడం మంచి శుభపరిణామం అన్నారు..

ఈ కార్యక్రమంలో కృష్ణ,యాదగిరి, రమేష్,నారాయణ,మహేష్,సుధాకర్, దూదిమెట్ల సోమేష్ యాదవ్, యాదిలాల్,పెంటయ్య,కృష్ణారెడ్డి,సురేష్ రెడ్డి,శివ స్వాములు,భక్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు..