TEJA NEWS

ఐకెపి కేంద్రంలో హమాలీలకు గాయాలు

పాములపహాడ్ ఐకెపి కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన

గాయాలైన ముగ్గురు హమాలీలను 108 సహాయంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించిన బంధువులు

రోడ్లమీద ధాన్యం పోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామ రైతులు ప్రజలు

సూర్యాపేట జిల్లా : లారీ లోడు చేస్తుండగా బస్తాలు కూలి మీదపడి ఐకెపి కేంద్రంలో హమాలీలకు గాయాలైన సంఘటన నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండలం పాములపాడు గ్రామంలో చోటుచేసుకుంది.రోజువారి కూలీ పనుల్లో బాగంగా ధాన్యం బస్తాలను లోడ్ చేస్తున్న హమాలీలు ప్రమాదవశాత్తు బస్తాలు కూలి అదే గ్రామానికి చెందిన బొల్లెద్దు వెంకన్న,గండమల్ల కృష్ణయ్య, ఏపూరి లింగయ్య, అనే ముగ్గురు హామాలీ కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక వైద్యాన్ని అందించిన అనంతరం వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు తెలపడంతో అక్కడ సరైన సదుపాయాలు లేని కారణంగా మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ సహాయంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై
స్థానికులు, హమాలీలు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఐకెపి సెంటర్లో రైతుల ధాన్యం కాంటా వేసి బస్తాలను లారీలు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బస్తాలు కూలాయని ఈ ముగ్గురిలో గండమల్ల కృష్ణయ్య లారీ పై కింద పడిపోవడంతో క్రింద ఉన్న లింగయ్య, వెంకన్నలపై బస్తాలు ఒక్కసారిగా మీద పడడంతో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారని వివరించారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కొందరు రైతులు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఐకెపి కేంద్రాన్ని నిర్వహించేందుకు సరైన స్థలం తీసుకోకపోవడంతో ఇబ్బంది జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి, ఐకెపి నిర్వాహకుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయమై సంబంధిత ప్రాజెక్టు డైరెక్టర్ ను వివరణ కోరగా స్థల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేశామని స్థలం లభించకపోవడంతో చేసేది ఏమీ లేక గతంలో నిర్వహించినట్లే నిర్వహించామని తెలిపారు.స్థలమే కావాలనుకుంటే తర్వాత నిర్వహించబోయే ఐకెపి కేంద్రాన్ని స్థలం దొరికిన తర్వాతనే నిర్వహిస్తామని చెప్పారు. ఈ విషయమై ఆ మండలానికి సంబంధించిన ఏపీఎం, సీసీలకు చెప్పడం జరిగిందని వెంటనే స్పందించి స్థలానికి చేరుకొని సమాచారం అందించాలని ఆదేశించానని తెలిపారు. అదేవిధంగా స్థానిక వి బి కే, అధ్యక్షురాలినీ వివరణ కోరగా ఇది అనుకోకుండా జరిగిందని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వారు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన హమాలీ కూలీలు సుమారు గంటన్నర పాటు స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ ఆ వైపుగా ఏపీఎం, సీసీలు రాకపోవడం వారి బాధ్యత రహిత్యానికి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఐకెపి నిర్వహణలో నిర్లక్షం వహించిన నిర్వాహకులపై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదానికి గురైన తమవారికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించాలని వారి బంధువులు కోరుతున్నారు.