TEJA NEWS
  • జాలాదిలో మెటల్ రోడ్డుకు శంఖుస్థాపన చేసి, 10లక్షలతో నిర్మించిన కాలువల్ని ప్రారంభించిన మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి

గత ప్రభుత్వం 5 ఏళ్లపాటు ఎక్కడా రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, కూటమిప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో రోడ్లనిర్మాణం వేగవంతమైందని, గ్రామాల్లో పొలాలకు వెళ్లే డొంకలు, చిన్న రోడ్లను కూడా బాగుచేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గత ప్రభుత్వంలా పేదల్ని మాటలతో వంచించడం కూటమిప్రభుత్వం చేయదని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి అందాల్సిన బకాయిలు కూడా త్వరలోనే అందుతా యని ప్రత్తిపాటి చెప్పారు. యడ్లపాడు మండలం జాలాదిలో రూ.10లక్షలతో నిర్మించిన డ్రైనేజ్ లను ప్రారంభించిన ప్రత్తిపాటి, అనంతరం జాలాది – కొప్పర్రు మధ్య 40 లక్షల రూపాయల నిధులతో వేయబోయే మెటల్ రోడ్డుకు శంఖుస్థాపన చేశారు.