కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్‌టీయూసీ కట్టుబడి ఉంది….

TEJA NEWS

కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్‌టీయూసీ కట్టుబడి ఉంది….

వైద్య మండలి పునరుద్ధరణపై కార్మికుల హర్షం…

–నరసింహ రెడ్డి, ధర్మపురి…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
ఆర్జీ-1 ప్రాంతంలోని జీడీకే ఓపెన్ కాస్ట్ గని-5లో గని కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షుడు సదానందం అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఐఎన్‌టీయూసీ గేటు సమావేశంలో కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి, ధర్మపురి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా గుర్తింపు సంఘం వైఫల్యాలను కార్మికులకు వివరించారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉండి సింగరేణిని దోచుకున్న నాయకులు ఇప్పుడు కొత్త నాటకాలతో కార్మికులను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు బొగ్గు నిల్వల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని, గత ఎన్నికల్లో బొగ్గు బెల్ట్ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటమి పాలైనప్పటికీ వారికి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. పదేళ్లు గుర్తింపు సంఘంగా కొనసాగిన వారు 40 వేల ఓట్లలో కనీసం 1200 ఓట్లు కూడా సాధించలేకపోయారని, అలాంటి వారు ఏ ముఖంతో కార్మికుల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు.

అలాగే ఏఐటీయూసీ పోరాటాలు మాని కేవలం పైరవీలకే పరిమితమైందని ఆరోపించారు. కార్మికులు తమపై ఉంచిన నమ్మకంతో ఆరు ప్రాంతాల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించి ప్రాతినిధ్య సంఘ హోదా కల్పించారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా పెండింగ్‌లో ఉన్న ఆధారిత ఉద్యోగుల నియామక పత్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందించనున్నట్లు తెలిపారు. అలాగే వైద్య మండలి పునరుద్ధరణ చేపట్టి ఈ నెల నుంచే వేగవంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

మారుపేర్ల మార్పులపై యాజమాన్యం, సంఘ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి అమలు దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మికుల, ఉద్యోగుల భద్రతతో పాటు సింగరేణి సంస్థ మనుగడ దృష్ట్యా కొత్త బొగ్గు గనుల ప్రారంభంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. సొంత ఇంటి పథకం మరియు ఇతర సౌకర్యాలపై ఆదాయపు పన్ను మినహాయింపుల విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, ఉప ప్రధాన కార్యదర్శులు గడ్డం కృష్ణ, బేబీ శ్రీనివాస్, గనుల సిబ్బంది బాధ్యుడు పోతరబోయిన సమ్మయ్య, జనగామ శ్రీనివాస్, సాగర్, నవీన్‌తో పాటు శాఖ నాయకులు గుండేటి శ్రీనివాస్, తాటికొండ ఆంజనేయులు, చారి, కుశనపల్లి శంకర్, రాజయ్య, వెంకటేశ్వర్లు, అశోక్, పరశురామ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top