TEJA NEWS

ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరి రామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్:
కాలేశ్వరం ఈఎన్సీ హరీ రామ్ ఇంట్లో ఏసీబీ సోదా లు చేపట్టింది హైదరాబాద్ నగరంలోని షేక్ పేట ఆదిత్య టవర్స్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుండి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

కాళేశ్వరం కమిషన్ విచా రణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు పేల్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్‌ను విచారించిం ది. ఈ మేరకు జస్టిస్ పీసీ చంద్రఘోష్,ఆయనకు 90కి పైగా ప్రశ్నలను సంధించారు.

అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపు లకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు.