TEJA NEWS

ఒ&ఎం పనులపై ఇరిగేషన్ అధికారులు మరియు నీటి సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే వేగుళ్ళ సమావేశం…

ఇటీవల శాంక్షన్ అయిన ఒ&ఎం పనులపై నీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులతో మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఉన్న నీటి సంఘాల వారంతా వారి వారి పరిధిలో జరుగుచున్న ఇరిగేషన్ పనులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారులు ఏ పనులకు ప్రతిపాదనలు పంపుచున్నారు. శాంక్షన్ ఏ పనులకు వచ్చినవి అన్న విషయాలను తప్పకుండా తెలుసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ భాద్యత తీసుకోకపోతే ముఖ్యమైన పనులను ప్రయారిటీలో చేయించుకునే అవకాశం ఉండదన్నారు.

నీటి సంఘాల అధ్యక్షులు మండలానికి ఇద్దరు చొప్పున భాద్యత తీసుకుని ఇరిగేషన్ కు సంబంధించిన ప్రతీ విషయాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు మండపేట నియోజవర్గం నకు శాంక్షన్ అయిన ఇరిగేషన్, డ్రైన్ పనులను నీటీ సంఘాల ప్రతినిధులకు వివరించారు. ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.1.16 కోట్లు, డ్రైన్స్ పనులకు సంబంధించి రూ.1.19 కోట్లు శాంక్షన్ అయినట్లు అధికారులు తెలిపారు. నీటి సంఘాల ఆధ్వర్యంలో వారి వారి పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, మండపేట మండల అధ్యక్షులు యరగతపు బాబ్జి, నీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులు, తదితర్లు పాల్గొన్నారు….