
నీచ సంస్కృతిని ప్రేరేపిస్తున్న జగన్ రెడ్డి
** టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధూజ
తిరుపతి: వైయస్సార్సిపి నాయకులు టిడిపి మహిళా ఎమ్మెల్యేలను అవహేళన చేస్తే జగన్ రెడ్డి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఓదార్పు యాత్ర చేస్తు… నీచ సంస్కృతిని ప్రేరేపిస్తున్నాడని టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి జోన్-4 టీడీపీ ఇంచార్జ్ డా.అంబూరు సింధూజ ఆరోపించారు. జగన్ అండ్ కో బ్యాచ్ ను ఆంధ్ర రాష్ట్రప్రజలు ఎప్పుడో ఉక్కు పాదంతో అణచివేశారని, తెలియక వైసిపి నాయకులు మిడిసి పడుతున్నారని అన్నారు. వైసిపి నాయకులు ప్రభుత్వంలో ఉన్నా… ప్రభుత్వంలో లేకున్నా వారి వక్ర బుద్ధిని చూపిస్తున్నారని, గత వైసిపి ప్రభుత్వంలో మామిడి రైతులకు వారు ఇచ్చినరేటు, ప్రస్తుత ప్రభుత్వంలో వారికి ఇస్తున్న రేటు, అదే మామిడి రైతులను అడిగి తెలుసుకోవాలన్నారు.
గత వైసిపి ప్రభుత్వంలో బంగారుపాళ్యంలో మామిడి కాయల మండి గోడౌన్ కాలిపోతే జగన్ రెడ్డి ఏం పందిరి వేసాడో చెప్పాలని ఎద్దేవాచేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్ రెడ్డి, గత ఐదు సంవత్సరాలు ఇల్లు దాటని జగన్ రెడ్డి, ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకోవడం కోసం అన్ని జిల్లాలు తిరుగుతూ వినాశనాన్ని సృష్టించాలని చూస్తున్నాడన్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని భ్రష్టు పట్టిస్తూ అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ రెడ్డి…. నీ పంథా మార్చుకో, నీ స్వార్థం కోసం నీ పార్టీ కార్యకర్తలను జైలుపాలు చేస్తున్నావని గుర్తుంచు కోమన్నారు. అప్పుడు నీ రాక్షస పాలనలో అసెంబ్లీ సాక్షిగా తల్లి లాంటి భువనేశ్వరి మీద నీచమైన పదజాలంతో నీ అనుయాయులతో దుర్భాషలాడించావని, ప్రస్తుతం మహిళా శాసన సభ్యురాలిపై కూడా అవమానకరంగా మాట్లాడించావని దానికి ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుందని ఎదురు చూడమన్నారు. శిశుపాలుడు నూటొక్క తప్పులు చేసినట్లుగానే
నీవు చేసిన తప్పులను కూడా ఆ దేవదేవుడు గమనిస్తూనే ఉన్నాడని, తెలుసుకోవాలన్నారు. సమస్యను నీవే సృష్టించి ప్రజలలో సానుభూతి పొందాలని ఇతరులపై నిందలు వేసి నీ ఉనికిని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నావని.. నీ ప్రయత్నం ఎన్నటికీ సఫలం కాదని, నీ వికృత చేష్టలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని రాష్ట్రం కోసం, ప్రజల కోసం మంచి పనులు చేస్తే భవిష్యత్తు ఉంటుందని సింధూజ హితవు పలికారు.
