
పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం….
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు…*
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని అన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ..
రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోకసభ సభ్యులు .రాహూల్ గాంధీ , జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పాదయాత్ర లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* తో మరియు ఇంచార్జి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ * రాయల నాగేశ్వర రావు* మరియు జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – రాజేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు * కేఆర్ దిలీప్ రాజ్* స్టేట్ కో- ఆర్డినేటర్ * పులి అనిల్ * పాల్గొన్నారు…..
తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి పరిరక్షణ యాత్ర ను ప్రారంభించి సుమారు 2 కిలోమీటర్ల ప్రజలకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ముఖ్య ఉదేశం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు….
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు వారు మాట్లాడుతూ…
భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నేడు పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు….
గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యంగాన్నీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది,ప్రజల సమాన హక్కులు,సమ న్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగo ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూన్న తీరు తీవ్ర ఆక్షేపనియంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు..అందుకే రాజ్యoగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…
