
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం 5వ రోజు పాదయాత్ర ||
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 17వ, 18వ డివిజన్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని.
అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా, అదే విధంగా దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి, చిట్ల దివాకర్, కడియాల ఇందిరా, చౌదరి, ,జగదీష్ యాదవ్, కోలన్ జీవన్ రెడ్డి, కోలన్ బల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, జగన్ యాదవ్, అంజి బాబు, కృష్ణ గొల్ల, రమణి, హరీష్, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు , వెంకటేష్ పటేల్, రాజి రెడ్డి, రాజేందర్, జిత్తు , శ్రీశైలం, ప్రవీణ్ రెడ్డి, రాములు నాయక్, సురేష్ రెడ్డి, శరత్, మధుసూదన్ రెడ్డి, వీర బాబు, హరియా నాయక్, సాయి, ప్రేమ్, కోటేశ్వరి, నాగిన, సాయి రాజ్, నవ్య, మౌళీశ్వర్, నారాయణ రెడ్డి, మురళి, ప్రశాంత్ రెడ్డి, అది రెడ్డి, లక్ష్మణ్, శ్రీదేవి, యశోద, లక్ష్మి, గిరిజ కుమారి, సునీత, కరుణ, రామ, మొహమ్మద్, రఘు, హరి బాబు, నర్సింగ్ రావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
