TEJA NEWS

ఏ‌ఐ‌సి‌సి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తీసుకున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు 126 డివిజన్ జగద్గిరిగుట్ట అధ్యక్షులు గణేష్ అధ్వర్యంలో మగ్దూం నగర్ నుండి సీసాల బస్తి వరకు నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ గౌడ్, రషీద్ భాయ్, వరమ్మ, భరత్ గౌడ్, నరేందర్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్ చారి, స్వాతి, గోరె భాయ్, వేణు గౌడ్, కౌసల్య, కనకయ్య, మంగమ్మ, అనిత రెడ్డి, లలిత, వీణ, సునీత, మురళి, సనా, ఆర్ కె, అఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం దేశ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను ప్రజలందరికీ తెలియచేస్తూ, జాతిపిత మహాత్మా గాంధీ మరియు రాజ్యాంగ రచయిత అంబేడ్కర్ గారి త్యాగాలను తెలియచేస్తు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.