
జైభీమ్, జై బాపు, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం ||
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 7, 8,9 డివిజన్లలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి , కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ ఉజ్మా షాకీర్ , టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా, అదే విధంగా దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని అన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయాలని కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మనం చేసిన పనులను ప్రజలకు వివరించడానికి ఉపయోగపడుతుందని, తద్వారా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నగేష్ చారి, మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కడియాల ఇందిర , మధుసూదన్ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చౌదరి, ప్రవీణ్, కుమార్ యాదవ్, సురేష్ యాదవ్, జగన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, రవి, నాని, వర్మ రాజు, రమేష్, మల్లికార్జున్, గంగాధర్, శ్రీనివాస్, విష్ణు, చిరంజీవి, వాసు, వీరబాబు, రఫాత్, హరియా నాయక్, రాజేందర్, రామ్ చందర్ నాయక్, సాయి, లోకనద్, మురళి కృష్ణ, అరవింద్, తిరుపతి రెడ్డి, రాజి రెడ్డి, మధు, భూపతి కుమార్, కోటేశ్వర్, రాధా, నవ్య, సురేందర్ రెడ్డి, రవీందర్, హరి బాబు, రఘు, సురేష్, చిన్న కుమార్ యాదవ్, శ్రీనివాస్, బాలాజీ, శ్రీ రామ్ రెడ్డి, తులసి దాస్, మౌళీశ్వర్, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, రుత్విక్, చింకు, నాగరాజు, జ్యోతి, విజయ్, మురళి, రామ, లక్ష్మణ్, హరీష్, గౌస్, శరత్, యశోద, గిరిజ కుమారి, హేమ రెడ్డి, సునీత, నగిన, కరుణ, కోటేశ్వరి పాల్గొన్నారు
