కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చుక్క జయశ్రీ రాజు ను గెలిపించాలని మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ జింకల కృష్ణయ్య విజ్ఞప్తి
వనపర్తి :
వనపర్తిమున్సి పాలిటి పరిధిలోని ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చుక్క జయశ్రీ రాజును గెలిపించాలని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్డుల ఇంచార్జ్ జింకల కృష్ణయ్య శనివారం రాయగడ వీధిలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ఓటర్లనీ అభ్యర్థిస్తూ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా చుక్క రాజు వార్డు ప్రజలతో వారి సమస్యల పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నాడని ప్రభుత్వ పథకాలతో పాటు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇందిరమ్మ ఇండ్లు ఎల్ వో సి చెక్కులను అలాగే మేఘన అభయాసం అర్హులకురేషన్ కార్డులు వృద్ధులకు పెన్షన్లు సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు ఎమ్మెల్యే అండ సహకారంతో నిర్మిస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేశారని కాబట్టి చుక్క జయశ్రీ రాజు గెలిపించి మున్సిపాలిటీకి పంపిస్తే మున్సిపాలిటీ నిధులతో వార్డును మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన వార్డు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయ మురళి దేవన నాయుడు ముందకోటి శ్రీకాంత్ ఆర్తి ఆర్టి కిరణ్ మోహన్ రాజ్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
