
బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ స్టూడెంట్ లీడర్ గా కష్టపడి చదివి పైకి వచ్చిన ఉమ్మడి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు గ్రాడ్యుయేట్స్ సమస్యలు తెలుసునని, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చట్టసభలలో ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు అన్నారు.
విద్యావేత్త, సహనశీలి, త్యాగమూర్తి, మాజీ మంత్రి అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా మన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను చట్టసభలకు పంపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అన్నారు.
ఈనెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకె వేసి భారీ మెజార్టీతో మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టభద్రులు అందరూ గెలిపించాలని కోరుతున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో కుటమి నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
